: తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ అన్నదాతల ఆందోళన


నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్ లో రైతులు రోడ్డెక్కారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ అన్నదాతలు ఆందోళనకు దిగారు. హైదరాబాదు-విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో చేయడంతో భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి రాస్తారోకో చేస్తున్న రైతులను అడ్డుకున్నారు.

గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో చౌటుప్పల్ లోని మార్కెట్ యార్డులో క్వింటాళ్ల కొద్దీ ధాన్యం తడిసిపోయింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము నష్టపోయామని, ప్రభుత్వం తక్షణమే తమను ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News