: ఐపీఎల్ మ్యాచ్ లకు భారీ బందోబస్తు: సీపీ ఆనంద్
ఐపీఎల్-7 లో భాగంగా హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. 1500 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, సెల్ ఫోన్స్, అగ్గిపెట్టెలు, తినుబండారాలు అనుమతించమని తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో మొత్తం 4 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈనెల 12, 14, 18, 20 తేదీల్లో ఈ మ్యాచ్ లు జరుగుతాయి.