: ప్రేమించాడని...కోసేశారు!
ప్రేమ ఆ యువకుడికి జీవన్మరణ సమస్యను తెచ్చిపెట్టింది. బీహార్ లోని సివార్ జిల్లాలోని అసాంవ్ గ్రామంలో సుబోధ్ అనే యువకుడు అదే గ్రామంలోని ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. వీరి విషయం ఈ మధ్యే ఆమె ఇంట్లో తెలిసింది. అప్పట్నుంచి ఆమె కుటుంబ సభ్యులు సుబోధ్ పై కారాలుమిరియాలు నూరుతున్నారు. ఎప్పుడు దొరుకుతాడా...గట్టిగా బుద్ధి చెబుదామా అని ఆమె అన్నలు కాచుకున్నారు.
ఈ దశలో ప్రియురాలి ఇంటికి వెళ్లే అవకాశం ఆ అబ్బాయికి వచ్చింది. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన సుబోధ్ ప్రియురాలి ఇంటికి సంతోషంగా వెళ్లాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆ యువతి అన్నలిద్దరూ సుబోధ్ ని ఒడిసి పట్టుకుని కుర్చీకి కట్టేసి అతని జననాంగాన్ని కోసేశారు. తీవ్ర రక్తస్రావంతో సుబోధ్ ఆసుపత్రిపాలు కాగా, యువతి అన్నలిద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకుని, యువతిని ప్రశ్నిస్తున్నారు.