: కేసీఆర్ కు సవాల్ విసిరిన తలసాని
దమ్ముంటే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలవాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. అంతేకాదు, ఓడినవాళ్లు రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్దంగా ఉండాలని కూడా షరతు పెట్టారు. విద్యుత్ ఛార్జీలపై తెలుగుదేశం నేతలు చేస్తున్నవి దొంగదీక్షలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. విద్యుత్ కోతలు, ఛార్జీల పెంపుకు నిరసనగా టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయం వద్ద తలసాని సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు.