: రీపోలింగ్ నిర్వహిస్తాం: భన్వర్ లాల్
సీమాంధ్రలోని కొన్ని జిల్లాల్లో రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేస్తూ టీడీపీ, బీజేపీలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రం అందించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈనెల 12న లేదా 13న రీపోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. దానిపై ఈ సాయంత్రంలోపు సీఈసీ నుంచి నివేదిక రావచ్చని చెప్పారు. కాగా, కాకినాడ జేఎన్టీయూలోని ఈవీఎంలకు ఎలాంటి నష్టం జరగలేదని ఆయన వివరించారు. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించామన్నారు.