: కన్న కొడుకుని కిడ్నాప్ చేసిన ఘనుడు


కన్న కొడుకుని కిడ్నాప్ చేశాడు ఓ ప్రబుద్ధుడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన గోళ్ల శ్రీనివాసరావుకు తాడేపల్లికి చెందిన మహాలక్ష్మితో 2006లో వివాహమైంది. భార్యభర్తలిద్దరూ కూలి పనిచేసుకుని జీవనం సాగించేవారు. ఈ క్రమంలో భర్త తాగుడుకు బానిసై సంపాదనంతా మద్యానికి తగలేసేవాడు. దీంతో మహాలక్ష్మి ఎలాగోలా కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. ఈ విషయంలో గొడవలు జరిగి పెద్దల వరకు వెళ్లి పంచాయతీలు పెట్టించుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. ఇంతలో వారి దాంపత్యానికి కానుకగా ఓ బిడ్డ పుట్టాడు.

తాగొచ్చిన ప్రతిసారి భార్య పంచాయతీ పెడుతోందన్న కోపంతో శ్రీనివాసరావు మహాలక్ష్మిని వదిలేసి, మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. తాగుబోతు మొగుడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే అనుకుని మహాలక్ష్మి కుమారుడితో పుట్టింటిలో ఉంటోంది. ఈ నెల 7న ఓటేసేందుకు తాడేపల్లి వచ్చిన శ్రీనివాసరావు మహాలక్ష్మి ఇంటికి వచ్చి పిల్లాడితో ఆడుకుంటున్నట్లు నటించి, చాకెట్లు కొనిపెడతానంటూ తీసుకుపోయాడు. బిడ్డ ఎంతసేపటికీ ఇల్లు చేరకపోవడంతో మహాలక్ష్మి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి బిడ్డ కోసం ఆరా తీసింది. ఫలితం లేకపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News