: హ్యాపీ బర్త్ డే టు 'మొబైల్ ఫోన్'!


మనుషుల మధ్య భావ ప్రసారానికి, సమాచార వినిమయానికి ప్రధాన వాహకమైన ఉత్తరాన్ని నిలువునా పాతరేసిన ఘనత నిస్సందేహంగా మొబైల్ ఫోన్ దే. అలాంటి చరిత్ర కలిగిన మొబైల్ ఫోన్ పుట్టి నేటికి 40 ఏళ్ళయింది. 1973 ఏప్రిల్ 3న మోటారోలా కంపెనీ విప్లవాత్మక సెల్యులర్ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ పరికరం ఇప్పుడు సర్వాంతర్యామియై దర్శనమిస్తోంది.

నాలుగు దశాబ్దాల క్రితం.. ఓ రోజు, మోటారోలా కంపెనీలో సీనియర్ ఇంజినీర్ అయిన మార్టిన్ కూపర్, ప్రత్యర్థి కమ్యూనికేషన్స్ కంపెనీ ఉద్యోగితో తాను ఇప్పుడు సెల్యులర్ ఫోన్ లో మాట్లాడుతున్నట్టు చెప్పి సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. అది మొదలు ఈ క్షణం వరకు సెల్ లేనిదే ఒక్క నిమిషం గడవని స్థితికి మానవాళి చేరిందంటే అంతా టెక్నాలజీ మహిమే. ఎక్కడో సుదూరాన ఉన్న వ్యక్తులతో సైతం నిస్తంత్రీ విధానంలో సంభాషించడం ఓ దశలో మహాద్భుతమే అయింది.

ఇంతటి దివ్యోపకరణాన్ని మనకందించిన మార్టిన్ కూపర్ మహాశయుడు నేడు 85వ పడిలో ఉన్నాడట. ఆయన్ను 'ఫాదర్ ఆఫ్ మొబైల్ ఫోన్' అని పిలవడం సబబే. కాగా, సెల్ ఫోన్ ను ఆవిష్కరించిన సంస్థ మోటారోలా నేడు సోదిలో కూడా లేకుండా పోవడం విస్మయం కలిగిస్తోంది. నోకియా, శాంసంగ్, సోనీ ఎరిక్సన్, ఎల్జీ వంటి దిగ్గజాలకు తోడు చైనా మొబైళ్ళ ప్రవాహంలో మోటారోలా ఎప్పుడో కొట్టుకుపోయిందన్నది టెక్ జనుల మాట. 

  • Loading...

More Telugu News