: కిరణ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది: కేటీఆర్
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మైనారిటీలో ఉందనీ, అది కొనసాగడానికి ఇక ఒక్క క్షణం కూడా అర్హత లేదనీ టీఆర్ఎస్ శాసన సభ్యుడు కె.తారకరామారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలం ప్రస్తుతం 146కు పడిపోయిందనీ, అంటే మైనారిటీలో పడినట్టేననీ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విషయంలో త్వరలో రాష్ట్ర గవర్నర్ ను కలిసి బలపరీక్షకు ఆదేశించాలని కోరతామనీ ఆయన అన్నారు.
గురువారం ఢిల్లీ వచ్చిన కేటీఆర్ పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మీద కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల జరిగిన సహకార ఎన్నికలను అడ్డం పెట్టుకుని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ముఖ్యమంత్రి అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. అటువంటి ముఖ్యమంత్రిని తెలంగాణా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాపాడుతున్నారని వారిపై కేటీఆర్ మండిపడ్డారు.