: మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా?...అయితే రోజూ ఇవి తినండి!


వయసు పెరిగే కొద్దీ శరీరంలో పటుత్వం తగ్గుతుంది. ఒంట్లో ఉన్న బలహీనతలన్నీ బయటపడుతుంటాయి. ముఖ్యంగా మోకాళ్లు, కీళ్ల నొప్పులు ప్రతి ఒక్కరినీ బాధించేవే. అయితే మోకాళ్ల నొప్పులకు పరిశోధకులు ద్రాక్ష పళ్లతో చెక్ పెట్టచ్చని చెబుతున్నారు. రోజూ తీసుకునే ఆహారంతో పాటు కొన్ని ద్రాక్ష పళ్లు కూడా తీసుకుంటే మోకాలి నొప్పి చాలా వరకు తగ్గిపోతుందని అమెరికాలోని టెక్సాస్ ఉమెన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షానిల్ జుమా సలహా ఇస్తున్నారు.

ద్రాక్షలో పోలీపినాల్స్ ఉండడంతో ప్రతి రోజూ ద్రాక్ష తినడం వల్ల నరాలు, కీళ్లలో పటుత్వం పెరిగి మోకాలి నొప్పి తగ్గుతుందని తాము నిర్వహించిన పరిశోధనలో తేలిందని ఆమె తెలిపారు. మోకాలి నొప్పితో బాధపడుతున్న 72 మంది పురుషులు, మహిళలపై పరిశోధనలు నిర్వహించి, రోజూ ద్రాక్ష తినడం వల్ల వారి సమస్యలు నయమైనట్టు గుర్తించామని ఆమె వెల్లడించారు. కీళ్ల నొప్పుల బాధితులూ, ఇంకెందుకు ఆలస్యం రోజూ ద్రాక్ష తినండి. ఆరోగ్యంగా ఉండండి!

  • Loading...

More Telugu News