: ఆసెట్ ఈ నెల 24 నుంచి ప్రారంభం
ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఆసెట్ (ACET) -2014 పరీక్ష ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. విశాఖపట్టణంలో ప్రవేశాల సంచాలకుడు ఆచార్య అనిల్‌కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 24వ తేదీ ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు లైఫ్ సైన్సెస్ పరీక్ష నిర్వహిస్తామని అన్నారు. అలాగే 11.30 నుంచి ఒంటిగంట వరకు హ్యూమానిటీస్, సోషల్ సైన్స్, మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు మేథమేటికల్ సైన్స్, 25న ఉదయం 9 గంటలకు ఫిజికల్ సైన్స్, 11.30 గంటలకు కెమికల్ సైన్స్, మధ్యాహ్నం 2.30 గంటలకు తెలుగు, 26న ఉదయం 9 గంటలకు ఇంగ్లీష్, 11.30 గంటలకు జియాలజీ కోర్సులకు పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు.
ఐదేళ్ల సమీకృత ఇంజనీరింగ్, డ్యూయల్ డిగ్రీ, ట్విన్నింగ్ ప్రోగ్రాం కోర్సులకు 24న మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నామని ఆయన స్పష్టం చేశారు. పరీక్షల పూర్తి వివరాలకు ఆంధ్రా యూనివర్సిటీ వెబ్‌సైట్‌లు www.andhrauniversity.edu.in/doa, www.audoa.in సందర్శించవచ్చని పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పరిధిలోని పీజీ కోర్సులలో ప్రవేశాలను సైతం ఆసెట్ ద్వారా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.