: హోరాహోరీ పోరులో ఇద్దరు తీవ్రవాదుల హతం
జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో ఆర్మీ జవానులు, తీవ్ర వాదుల మధ్య హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ఇద్దరు తీవ్రవాదులు మృతి చెందగా, ఒక జవాను గాయపడ్డాడు. నలుగురు తీవ్రవాదులు పూంఛ్ సెక్టార్ పరిధిలోని వాస్తవాధీన రేఖను దాటి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించడాన్ని గుర్తించిన జవానులు, వారితో తలపడ్డారు. కాగా మరో ఇద్దరు పలాయనం చిత్తగించారు.