: హరీష్ రావు టీఆర్ఎస్ ను చీలుస్తాడని కేసీఆర్ భయపడుతున్నాడు: రాజేంద్రప్రసాద్


టీఆర్ఎస్ ను హరీష్ రావు నిలువునా చీలుస్తాడేమోనని ఆ పార్టీ అధినేత కేసీఆర్ భయపడుతున్నాడని టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్, జగన్ ది కాంగ్రెస్ డీఎన్ఏ అని అందరికీ అర్థమైందని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కు భంగపాటు తప్పదని అన్న ఆయన, తెలంగాణలో ఓడిపోవడంలో కేసీఆర్ హ్యాట్రిక్ కొడతాడని చెప్పారు. హరీష్ రావు నేతృత్వంలో టీఆర్ఎస్ చీలిపోకుండా ఉండడానికే కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ మద్దతు తెలుపుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News