: 'పెళ్లి రేపు కదా... ఇవాళ నాతో వచ్చేయ్'


పెద్దలు కుదిర్చిన పెళ్లిని రద్దు చేసుకుని తనతో వచ్చేయాలని హల్ చల్ చేశాడో యువకుడు. హైదరాబాదులోని కార్ఖానా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కార్ఖానా గన్ రాక్ నగర్ కు చెందిన ఓ యువతి (18) ఇంటికి అర్ధరాత్రి సమయంలో అమీర్ పేట్ కు చెందిన ఆజాద్ (23), వంశీ (24), వేణుగోపాల్ (23) వెళ్లారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిని రద్దు చేసుకుని తనతో తక్షణం రావాలంటూ ఆజాద్ ఆ అమ్మాయిని బలవంతం చేశారు.

అంతటితో ఆగకుండా ఆమె కుటుంబసభ్యులను బెదిరించారు. దీంతో వారు కార్ఖానా పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేసిన పోలీసులు, బెదిరింపులకు పాల్పడిన ముగ్గురు మిత్రులపై నిర్భయ చట్టంకింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ యువతికి ఈ రోజు సాయంత్రం పెళ్లి జరుగనుంది.

  • Loading...

More Telugu News