: కాకినాడలో ఈవీఎంలు సేఫ్... అభ్యర్థులు కంగారు పడవద్దు: కలెక్టర్
కాకినాడలో జేఎన్టీయూ స్ట్రాంగ్ రూములోకి వర్షపు నీరు వచ్చిన మాట నిజమేనని, అయితే ఈవీఎంలు మాత్రం తడవలేదని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్ స్పష్టం చేశారు. ఇవాళ జేఎన్టీయూలోని స్ట్రాంగ్ రూమ్ ను కలెక్టర్ పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈవీఎంల విషయంలో అభ్యర్థులు కంగారు పడాల్సిన పనిలేదని ఆయన చెప్పారు.
కాకినాడ పార్లమెంటు, ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎం బాక్స్ ల కిందకు వర్షపు నీరు చేరిందన్నారు. అయితే ఈవీఎంలను క్షుణ్ణంగా పరిశీలించామని, అవి తడవలేదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.