: కాంగ్రెస్ కు దమ్ము లేదు... మోడీని జైలుకు పంపుతా: మమతా బెనర్జీ
ప్రస్తుతం ఢిల్లీలో కాంగ్రెస్ స్థానంలో తాను గనుక ఉంటే బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని జైలుకు పంపుతానంటున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అయితే, కాంగ్రెస్ కి ఆ దమ్ము లేదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు బెంగాల్లోని ముర్షీదాబాద్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడిన మమత, మోడీ విషయంలో కాంగ్రెస్ భయపడుతోందని ఆరోపించారు. మొదట్లో బీజేపీపై బాగా ఒత్తిడి తెచ్చిందనీ... కానీ, ఇప్పుడు హస్తానికి అలాంటి ధైర్యం లేదన్నారు.