: అమిత్ షాకు ముంబయి కోర్టు సమన్లు


బీజేపీ నేత, నరేంద్రమోడీ సన్నిహితుడు అమిత్ షాకు ముంబయిలోని ప్రత్యేక సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. 2006 తులసీరామ్ ప్రజాపతి ఎన్ కౌంటర్ కేసులో షాతో పాటు మరో 36 మందికి సమన్లు పంపింది. మే 23లోగా నిందితులందరూ తమ ఎదుట హాజరుకావాలని కోర్టు జడ్జి జేటీ.ఉపత్ ఆదేశించారు. 2005లో గుజరాత్ లోని గాంధీనగర్ లో గ్యాంగ్ స్టర్ షోహ్రబుద్దీన్ షేక్, అతని భార్య కౌసర్ బీ ను ఆ రాష్ట్ర యాంటి టెర్రరిజమ్ స్క్వాడ్ నకిలీ ఎన్ కౌంటర్ చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఈ కేసు ముంబయికి ట్రాన్స్ ఫర్ అవగా, నిందితులందరిపై 2012 సెప్టెంబర్ 29న సీబీఐ చార్జ్ షీటు ఫైల్ చేసింది. ఈ కేసులో తులసీరామ్ ప్రజాపతి అనే వ్యక్తి కీలక సాక్షిగా ఉన్నారు. ఆయనని కూడా తదనంతరం ఎన్ కౌంటర్ చేశారు.

  • Loading...

More Telugu News