: రాహుల్ గాంధీకి ఈసీ షోకాజ్ నోటీసు
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీ ఉదయం 11 గంటల్లోగా వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో ఈసీ తదుపరి చర్యలు చేపడుతుందని ఆ నోటీసులో పేర్కొంది. బీజేపీ అధికారంలోకి వస్తే హింసాకాండలో 22 వేల మంది చనిపోతారంటూ రాహుల్ హిమాచల్ ప్రదేశ్ లోని ఓ సభలో వ్యాఖ్యానించడంతో బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. రాహుల్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు ప్రాథమికంగా గుర్తించిన ఈసీ నోటీసు జారీ చేసింది.
ఇదిలా ఉండగా అమేథీలో పోలింగ్ సందర్భంగా రాహుల్ ఈవీఎం సమీపానికి వెళ్లడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దాంతో ఈవీఎం ఉన్న ప్రాంతానికి వెళ్లడం ద్వారా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారా? అన్న అంశం నిర్థారించేందుకు మరింత లోతుగా విచారణ జరపాలని ఈసీ ఆదేశించింది. దీనిపై సోమవారానికల్లా ఈసీ నిర్ణయం తీసుకోనుంది.