: హైదరాబాద్ లో ఆ రెండు ప్రదేశాలూ.. డబుల్ ఓకే..!
ఎగువ మధ్య తరగతి ప్రజలకు భాగ్యనగరం ఓ అందాల హరివిల్లు అయితే.. మియాపూర్, ఎల్బీ నగర్ వంటి కాలనీలు నివాస యోగ్య పరంగా వారికి స్వర్గధామాలేనట. సొంత ఇళ్ళ కొనుగోళ్ళకు గానీ, అద్దె గృహాల విషయంలో గానీ ఈ రెండు ప్రాంతాలు హైదరాబాద్ లో అత్యంత అనుకూలమని ఓ సర్వే చెబుతోంది. మియాపూర్, ఎల్బీ నగర్ లో అందుబాటు ధరల్లో నివాస యోగ్యమైన ఇళ్ళు లభిస్తాయని ఆ సర్వే పేర్కొంటోంది.
ఆరోగ్యకరమైన జీవనశైలికి ఈ ప్రాంతాలు అతికినట్టు సరిపోతాయట. ఇక అత్యంత ఖరీదైన ప్రదేశం బంజారా హిల్స్ లో సాధారణ ప్రజల ఆవాస యోగ్యత చాలా తక్కువట. ఎందుకంటే, ఆకాశాన్నంటే స్థలం రేట్లు, మధ్య తరగతికి చుక్కలు చూపే ఇంటి అద్దెలు.. సగటు జీవిని, సంపన్న వర్గాల కాలనీకి దూరంగా ఉంచుతున్నాయని ఆ సర్వే చెబుతోంది.