: బర్త్ సర్టిఫికెట్ బదులు డెత్ సర్టిఫికెట్!
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం జమ్మలపల్లి గ్రామంలో వెంకటేశ్వర్లు అనే పంచాయతీ కార్యదర్శి లంచం కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నాడు. ఈ క్రమంలో బంగారు తల్లి పథకం కోసం తమ పాపకు బర్త్ సర్టిఫికెట్ ఇమ్మని తల్లిదండ్రులు అతడిని అడిగారు. ధ్రువీకరణ పత్రం ఇవ్వాలంటే రూ.400లు ఇస్తే అవుతుందని చెప్పాడు. అందుకు వారు నిరాకరించడంతో పాపకు బర్త్ సర్టిఫికెట్ బదులు డెత్ సర్టిఫికెట్ ఇచ్చాడు. వెంటనే అతనిపై తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేశారు.