: వర్షానికి తడిసిన ఈవీఎంలు... ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం
కాకినాడలోని జేఎన్ టీయూ పెట్రోలియం బ్లాకులో ఉంచిన ఈవీఎంలు అకాల వర్షాల బారిన పడ్డాయి. కాకినాడ పార్లమెంటు, పత్తిపాడు అసెంబ్లీకి చెందిన ఈవీఎంలు తడిసి ముద్దయిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ ఈవీఎంలను పరిశీలించారు. విషయం తెలుసుకున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల నిర్లక్షంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.