: కన్నడ సినీ నటుడు రఘువీర్ మృతి
ప్రముఖ కన్నడ సినీ నటుడు రఘువీర్ (46) గుండెపోటుతో గురువారం రాత్రి మృతి చెందారు. అజయ్-విజయ్ చిత్రంతో ఆయన సినీ రంగానికి పరిచయం అయ్యారు. 'శృంగార కావ్య' సినిమాలో తనతో పాటే నటించిన హీరోయిన్ సింధును వివాహం చేసుకున్నారు. వివాహం అయిన కొన్నేళ్లకు సింధు అనారోగ్య కారణాలతో మరణించడంతో ఆయన మానసికంగా కుంగిపోయారు. దీనికి తోడు తను నటించిన సినిమాలు కూడా నిరాశనే మిగల్చడంతో... సినీ పరిశ్రమకు కూడా దూరంగా ఉంటున్నారు. స్నేహితులు, పిల్లలతో కలసి తన ఎస్టేట్ కు వెళుతున్న సమయంలో ఆయన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.