: పిడుగులు పడి ఇద్దరు మహిళల మృతి
అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం మెట్టివానిపాలెంలో అంజలి అనే ఓ మహిళ, కందుకూరు మండలం కందలపాడు పంచాయతీలో రత్తమ్మ అనే మరో మహిళ పిడుగుపాటుకు గురై మృతి చెందారు.