: బాలురపై ఉపాధ్యాయుడి అకృత్యం!


సృష్టి ధర్మానికి విరుద్ధంగా, సభ్య సమాజం తలదించుకునేలా ఓ ఉపాధ్యాయుడు అకృత్యానికి పాల్పడ్డాడు. విద్యాబుద్దులు నేర్పి ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన గురువు స్థానంలో ఉండి కీచకుడి అవతారమెత్తాడు. కడపలోని ఏక్‌మీనార్ దర్గా మదర్సాలో ఇద్దరు బాలురపై టీచర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలుర పరిస్థితి విషమించడంతో స్థానిక రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బాలుర తల్లిదండ్రులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News