: ఒబామాను వేధిస్తోన్న 'మూడు పౌండ్ల పదార్థం' ..!


'ఖగోళంలో ఎక్కడో కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నూతన గెలాక్సీలను వెలుగులోకి తెస్తున్నాం, పరమాణువు కంటే అతి చిన్న కణాలనూ ఆవిష్కరిస్తున్నాం, అయినా, మన రెండు చెవుల మధ్య ఉన్న మూడు పౌండ్ల పదార్థం మెదడు విషయాన్ని ఇప్పటికీ తేల్చలేకున్నాం'.. ఈ మాటలన్నది మరెవరో కాదు. సాక్షాత్తూ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామానే. ఈ క్రమంలో 'బ్రెయిన్ ఇనిషియేటివ్' అంటూ ఓ తక్షణ కార్యక్రమానికి పచ్చజెండా ఊపారు.

అర్జెంటుగా తన ప్రత్యేక బడ్జెట్ నుంచి రూ. 540 కోట్ల నిధులు కేటాయించారు. ఈ కార్యక్రమం ఉద్ధేశం చాలా సుస్పష్టం. మానవ మస్తిష్కాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడం ద్వారా దాని గుట్టుమట్లు తెలుసుకుని తద్వారా, అల్జీమర్స్, మూర్ఛ వంటి వ్యాధుల అంతు తేల్చాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం వైట్ హౌస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఒబామా ఈ పరిశోధన కార్యక్రమాన్ని ప్రకటించారు.  

  • Loading...

More Telugu News