: నేదురుమల్లిని అధిష్ఠానం అగౌరవపరిచింది: కాంగ్రెస్ నేతలు


మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి భౌతికకాయాన్ని ఇందిరాభవన్ లో ఉంచడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. గాంధీ భవన్ లో ఉంచితే ఆయనకు సరైన మర్యాద ఇచ్చినట్టు ఉండేదని అభిప్రాయపడ్డారు. గతంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విషయంలో వ్యవహరించినట్టే... ఇప్పుడు నేదురుమల్లి విషయంలో కూడా కాంగ్రెస్ అధిష్ఠానం వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News