: ఆ పడవ ప్రమాదం మృతుల సంఖ్య 273...మరో 31 మంది లెక్క తేలాలి


దక్షిణ కొరియా నౌక మునిగిపోయిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 273కి చేరింది. మరో 31 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదానికి గురైన తరువాత ఆచూకీ తెలియాల్సి ఉన్న 31 మందిలో ఏ ఒక్కర్నీ ప్రాణాలతో గుర్తించలేదని అధికారులు వెల్లడించారు. దక్షిణ కొరియాలో 476 మందితో ప్రయాణిస్తున్న నౌక మునిగిపోయిన సంగతి తెలిసిందే. 476 మందిలో 172 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న సంగతి విదితమే.

  • Loading...

More Telugu News