: లండన్ కు వెళ్లే టూరిస్టుల్లో మన వాళ్లే ఎక్కువ!
లండన్ నగరాన్ని సందర్శించేందుకు వెళ్లే వారిలో భారతీయులే ఎక్కువట. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే లండన్ కు గతేడాది 16 మిలియన్ల టూరిస్టులు విచ్చేశారంటూ లండన్ అంతర్జాతీయ ప్రయాణికుల సర్వే సంస్థ వెల్లడించింది. వారిలో అత్యధికులు భారతీయులేనని కూడా ఆ సంస్థ తెలిపింది. 2013 సంవత్సరానికి గాను లండన్ ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక నగరంగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో 2011 సెప్టెంబరు - 2012 సెప్టెంబరు మధ్య కాలంలో లండన్ కు వచ్చిన టూరిస్టులపై సర్వే నిర్వహించగా... ఆ సమయంలో 2,35,000 మంది భారతీయులు లండన్ చూసేందుకు వచ్చారట.