: చైనా నుంచి అమెరికా రైలు మార్గం...సాకారమైతే అద్భుతమే!
రైలు మార్గం ఖండాంతరాలను తాకనుంది. ఆసియా ఖండంలోని చైనా నుంచి ఉత్తర అమెరికా ఖండంలోని అమెరికాకు రైలు మార్గం నిర్మించే ప్రతిపాదనలను చైనా పరిశీలిస్తోంది. రష్యా, కెనడా దేశాల మీదుగా వివిధ దేశాల సహకారంతో ఈ రైలు మార్గాన్ని నిర్మించే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ మేరకు వాంగ్ మేంగ్సూ అనే చైనీస్ రేల్వే నిపుణుడితో ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చైనా మీడియా కథనాలు వెల్లడించింది.
ఈ రైలు మార్గాన్ని 8 వేల మైళ్లకు పైగా నిర్మించాల్సి ఉంటుంది. ఈ రైలు అలస్కా చేరుకునేందుకు సముద్రంలో 125 మైళ్ల సొరంగాన్ని తవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ రైలు మార్గం పూర్తయితే ఈశాన్య చైనా నుంచి అమెరికా భూభాగంలో కాలు పెట్టేందుకు రెండు రోజులు పడుతుంది.