: రూ.2 కోట్లకు ముంచిన చిట్టీల దొంగలను పోలీసులు పట్టేశారు
చిట్టీల పేరుతో జరిగిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విశాఖలో ఇద్దరు మహిళలు సుమారు రూ. 2 కోట్ల రూపాయలకు జనాన్ని ముంచి పరారయ్యారు. విశాఖపట్నంలోని అంగడిదిబ్బ ప్రాంతానికి చెందిన తల్లీకూతుళ్లు వరలక్ష్మి, అన్నపూర్ణ ఈ మోసానికి పాల్పడ్డారు. దసరా, శ్రావణమాసం సందర్భంగా చిట్టీలు ప్రారంభించి వీరు నగదు వసూలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వీరి వద్ద చిట్టీలు కట్టిన వారిలో ఉన్నారు.
చిట్టీల మోసం వెలుగులోకి రావడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఎన్నికల విధుల్లో ఉండటంతో పోలీసులు తొలుత పట్టించుకోలేదు. తర్వాత తల్లీకూతురు సహా ఐదుగుర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.