: కేసీఆర్ నా శక్తిని చూసి భయపడుతున్నాడు: పొన్నాల
కేసీఆర్ తన శక్తిని చూసి భయపడుతూ ఏదోటి వాగుతున్నాడని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ లో ఆయన మాట్లాడుతూ, దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ కు, ఆయన మాట మీద ఆయనకే గౌరవం లేదని ఎద్దేవా చేశారు. అందుకే దళిత సీఎం మాట మార్చాడని విమర్శించారు. దళితులు, బీసీలే కేసీఆర్ కు బుద్ధి చెబుతారని పొన్నాల తెలిపారు.