: నైజీరియాలో అమెరికా ఆపరేషన్ 'బోకోహరం' ప్రారంభం
నైజీరియాలో 200 మంది పాఠశాల బాలికలను అపహరించిన బోకోహరం సంస్థకు చెందిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు అమెరికా తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం ఆ దేశానికి చెందిన మిలటరీ అధికారులు ఇప్పటికే నైజీరియాకు చేరుకుని ఉగ్రవాదులను పట్టుకునేందుకు 'బోకోహరం' ఆపరేషన్ ప్రారంభించారు. ఏడుగురు సభ్యులతో కూడిన బృందం ఈ ఆపరేషన్ లో పాల్గొంటుందని అమెరికా ప్రతినిధులు వెల్లడించారు.