: పూరీ జగన్నాథుని రథాల కోసం కలప కావాలి!


పూరీ జగన్నాథుని వార్షిక రథయాత్ర కోసం తలపెట్టిన మూడు రథాల నిర్మాణంలో శ్రీ జగన్నాథ దేవస్థాన పాలనా యంత్రాంగం (ఎస్.జె.టి.ఎ) కలప దుంగల కొరతను ఎదుర్కొంటోంది. జూన్ 29వ తేదీన నిర్వహించే జగన్నాథుని రథయాత్ర కోసం ఉపయోగించనున్న రథాలకు ఇప్పుడు భారీగా కలప అవసరమవుతోంది. సెంట్రల్ రేంజ్ రెవిన్యూ డివిజనల్ కమిషనర్ వశిష్ఠ అధ్యక్షతన పూరీలో తొలిసారిగా సమావేశమైన సమన్వయ కమిటీ ఈ అంశాన్ని చర్చించింది. ప్రతి యేటా కన్నుల పండువగా జరిగే జగన్నాథుని రథయాత్రకు అవసరమైన మూడు రథాల నిర్మాణానికి రూ. 60 లక్షల విలువైన సుమారు 13 వేల చదరపు అడుగుల కలప అవసరమవుతుంది.

"తుంబాను (రథ చక్రాల మధ్యలో ఉంచేది) తయారీ కోసం మాకు కనీసం 42 పెద్ద కలప దుంగలు కావాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 28 దుంగలను మాత్రమే సరఫరా చేసింది" అని ఓ అధికారి చెప్పారు. కాగా నయాగఢ్ డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కావలసిన కొలతల్లో దుంగలు అందుబాటులో లేని కారణంగా దసపల్లా, బౌధ్ ప్రాంతాలకు సమీపంలోని అడవుల్లో అలాంటి భారీ దుంగలను సేకరించే ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో పెద్ద దుంగలు సమకూరుస్తామని నయాగఢ్ డివిజనల్ అటవీ అధికారి ఈ సమావేశంలో హామీ ఇచ్చారని ఆ అధికారి వెల్లడించారు.

  • Loading...

More Telugu News