: ఒకే కుటుంబం...రెండు ప్రమాదాలు...ముగ్గురి మృతి
ఆ కుటుంబాన్ని మృత్యుఘడియలు ముంచెత్తాయి. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలో నాలుగు గంటల వ్యవధిలో ఈ విషాదం చోటుచేసుకుంది. ధనశ్రీకదమ్ (17) అనే బాలిక పోటీ పరీక్ష రాసేందుకు ముంబై, గోవా హైవేపై ఆటోలో వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై మరణించింది.
విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు అంబులెన్సులో ఇంటికి ధనుశ్రీ మృతదేహాన్ని తీసుకెళ్తున్నారు. ముందు అంబులెన్సు వెళుతుండగా తల్లిదండ్రులు, మరో బంధువు వెనుక కారులో అనుసరించారు. వీరిద్దరూ సంఘటనా స్థలం నుంచి రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇంతలో ట్రాలర్ కు కట్టిన భారీ జేసీబీ యంత్రం అంబులెన్సు వెనుక వస్తున్న కారుపై పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ప్రవీణ్ కదమ్ (40), ప్రియాంక కదమ్ (38) తో పాటు బంధువు నరేష్ దేవ్ రే (50) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
నలుగురికి సహాయం చేసే వ్యక్తిగా పేరున్న ప్రవీణ్ కదమ్ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మృతి చెందడంతో గ్రామం విషాదంలో మునగగా, ఒకే రోజు తల్లిదండ్రులు, అక్కను పోగొట్టుకొన్న బాలిక శివం (15)ని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు.