: జగన్ 100 సీట్లకు పైగా గెలుస్తారు: కేసీఆర్


హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, ఆసక్తికరంగా సీమాంధ్ర ఫలితాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. సీమాంధ్రలో 100 సీట్లకు పైగా వైఎస్సార్సీపీ గెలుస్తుందని తెలిపారు. సీమాంధ్రలో జగన్ విజయఢంకా మోగిస్తారని అన్నారు. సీమాంధ్రలో తొలి ప్రభుత్వాన్ని జగన్ ఏర్పాటు చేస్తారని వెల్లడించారు. జగన్ గురించి మాట్లాడితే తప్పులేదని తెలిపారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పనులుంటాయని... జగన్ ఏమైనా అంటరాని వాడా? అంటూ ప్రశ్నించారు. భవిష్యత్తులో చంద్రబాబు సీఎం అయ్యే అవకాశాలు లేవని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News