: 60 స్థానాలకు పైగా సాధిస్తాం: కేసీఆర్
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 60 స్థానాలకు పైగా సాధిస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ కు 23 నుంచి 30 సీట్లకు మించి రావని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని తెలిపారు. ఎవరి మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఖమ్మంలో బోణీ చేస్తామని, హైదరాబాదులో మెరుగైన ఫలితాలను సాధిస్తామని తెలిపారు. క్యాంపు రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు.