: సైబరాబాద్ నగరాన్ని నిర్మించాం : చంద్రబాబు
తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, సైబరాబాద్ నగరాన్ని నిర్మించి రాష్ట్రంలో ఐటీ విస్తరణకు కృషిచేశామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తోన్న ఆయన పిఠాపురంలో మీడియాతో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే మళ్లీ రాష్ట్రాన్ని పురోగమనం బాట పట్టిస్తామన్నారు. కాకినాడ, పిఠాపురం, పెద్దాపురంలలో వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు నిర్మిస్తామని చెప్పారు.