: ఎన్టీఆర్ విగ్రహ పరిశీలనకు వస్తున్న అధికారులు


పార్లమెంటు సెంట్రల్ హాలులో తెలుగుతేజం దివంగత ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పక్షం నుంచి పనులు చురుకుగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఎన్టీఆర్ నమూనా విగ్రహ పరిశీలన నిమిత్తం ఢిల్లీ నుంచి పార్లమెంటుకు చెందిన అధికారుల బృందం ఈ రోజు హైదరాబాదు వస్తోంది. విగ్రహ రూపశిల్పి మయాచారి ఇంటికి వెళ్లి, విగ్రహాన్ని పరిశీలించి, తుది రూపకల్పనకు తగు సూచనలు ఇస్తారు.

  • Loading...

More Telugu News