: లంచగొండి రైల్వే ఎస్సై బుక్కయ్యాడు


లంచగొండి రైల్వే ఎస్సై లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. మంచిర్యాల రైల్వే పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వర్తించే కిరణ్ కుమార్ ఓ వ్యక్తి నుంచి రూ.30 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డాడు. అతని నుంచి నగదు స్వాధీనం చేసుకుని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. కిరణ్ కుమార్ లంచం డిమాండ్ చేయటంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దాంతో ఏసీబీ అధికారులు వలపన్ని రైల్వే ఎస్ఐ లంచం తీసుకుంటుండగా పట్టుకుని కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News