: పోలింగ్ శాతం తగ్గించేందుకే వైకాపా దాడులు: రాయపాటి
ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగితే టీడీపీ విజయావకాశాలు పెరుగుతాయనే భయంతోనే... పోలింగ్ నాడు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఆరోపించారు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తే... వారు ఓటు వేయడానికి రారనే అంచనాలతో వైకాపా దారుణాలకు పాల్పడిందని చెప్పారు. తనను కూడా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని, తన కారును కూడా ధ్వంసం చేశారని తెలిపారు. టీడీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.