: కాకినాడ తీరంలో 31 మంది శ్రీలంక జాలర్లు అరెస్ట్
భారత జలాల్లోకి ప్రవేశించిన 31 మంది శ్రీలంక జాలర్లను కాకినాడ సమీపంలో మెరైన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని కాకినాడ మెరైన్ పోలీస్ స్టేషనుకు తరలించారు. ఈ సందర్భంగా శ్రీలంక జాలర్ల నుంచి 4 టన్నుల టూనా చేపలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారు ప్రయాణిస్తున్న ఆరు పడవలను సీజ్ చేశారు. జాలర్లపై మెరైన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.