: దాడులను అరికట్టడంలో పోలీసులు వైఫల్యం: సి.ఎం రమేష్
సీమాంధ్రలో ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ దాడులు చేస్తే అరికట్టడంలో పోలీసులు వైఫల్యం చెందారని టీడీపీ ఎంపీ సి.ఎం. రమేష్ వ్యాఖ్యానించారు. ఐపీఎస్ అధికారులపై దాడులు చేస్తే చర్యలు కూడా తీసుకోలేదని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలపై ఢిల్లీలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. తమ ఫిర్యాదుపై సీఈసీ సానుకూలంగా స్పందించిందన్న రమేష్, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, పలు నియోజకవర్గాల్లో పోలింగ్ ఏకపక్షంగా జరిగేలా చేశారన్నారు.