: నేదురుమల్లికి జగన్ నివాళి
మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి భౌతికకాయాన్ని వైఎస్సార్సీపీ అధినేత జగన్ సందర్శించారు. పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. సోమాజిగూడలోని నేదురుమల్లి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. నేదురుమల్లి మృతి పట్ల జగన్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.