: హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాదు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షపు నీటితో రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అమీర్ పేట, ఎస్.ఆర్.నగర్, ఎర్రగడ్డ, ఖైరతాబాద్, దిల్ సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వర్షానికి తోడు మెట్రో రైల్ పనులు జరుగుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.