: కడప జిల్లాలో టీడీపీ నాయకుడిపై వైఎస్సార్సీపీ కార్యకర్తల దాడి
కడప జిల్లాలో టీడీపీ నాయకుడిపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు. నందలూరు మండలంలోని నల్లతిమ్మయ్యపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ గ్రామానికి చెందిన తిప్పల కృష్ణారెడ్డిపై అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడ్డ కృష్ణారెడ్డిని స్థానిక టీడీపీ కార్యకర్తలు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాపు చేస్తున్నట్టు నందలూరు ఎస్.ఐ తెలిపారు.