: ‘రూపే’ కార్డును జాతికి అంకితం చేసిన రాష్ట్రపతి
నగదు చెల్లింపులు చేసే ‘రూపే’ కార్డును భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతికి అంకితం చేశారు. ఈ కార్డు వీసా, మాస్టర్ కార్డుల తరహాలోనే నగదు చెల్లింపులు చేస్తుంది. దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) అభివృద్ధి చేసింది. రిజర్వ్ బ్యాంక్ అనుబంధ సంస్థగా, లాభాపేక్ష లేకుండా ఎన్ పీసీఐ పనిచేస్తోంది. ‘రూపే’ కార్డు సేవలను అన్ని ఏటీఎంలలో ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఆన్ లైన్ చెల్లింపులకు ఈ కార్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.