: హైదరాబాదులో బోర్డు తిప్పేసిన సాఫ్ట్ వేర్ కంపెనీ
హైదరాబాదులో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. సోమాజీగూడలో జీవీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీని మూర్తి, అమూల్య గతేడాది నవంబర్లో స్థాపించారు. ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి, శిక్షణ పేరుతో ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 40 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశారు. నెలలు గడిచినా ఉద్యోగాలు రాకపోవడంతో అభ్యర్థులు కంపెనీ నిర్వాహకులపై పంజాగుట్ట పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.