: కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా పోరాడతాం : బీజేపీ


రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రజల్లోకి వెళ్లి పోరాడతామని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ప్రజల ప్రయోజనాల కన్నా హైకమాండ్ కు విధేయత చూపేందుకే ముఖ్యమంత్రి కిరణ్ ఆసక్తి చూపుతున్నారని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కాంగ్రెస్ నుంచి విముక్తి కోరుకుంటున్నారని చెప్పారు.

రాష్ట్రంలో విద్యుత్ పై పోరు చేస్తున్న పార్టీ నేతల దీక్ష విరమింపజేసేందుకు హైదరాబాద్ వచ్చిన రవిశంకర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ సూచన మేరకు ఎమ్మెల్యేలు దీక్ష విరమించారని తెలిపారు. ప్రధాని మన్మోహన్ వద్ద కుర్చీ తప్ప అధికారం లేదని రవిశంకర్ విమర్శించారు. 

  • Loading...

More Telugu News