: జూరాల కాలువలో భారీ మొసలి


జూరాల ఎడమ కాలువలో భారీ మొసలి స్థానికుల కంటబడింది. కాలువకు నీటి విడుదల నిలిచిపోవడంతో మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలానికి చెందిన తోమాలపల్లి గ్రామస్తులు 10 అడుగుల పొడవున్న భారీ మొసలిని గుర్తించారు. గ్రామస్థులంతా గుమికూడి దాన్ని తాళ్లతో బంధించారు. అనంతరం గ్రామంలోని దేవాలయం వద్ద ఉన్న వేప చెట్టుకు కట్టేసి, అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు. దీంతో వనపర్తి బీట్‌ ఆఫీసర్లు నాగరాజు, రజనీకాంత్, శ్రీనివాసులు వచ్చి దాన్ని తీసుకెళ్లి జూరాల డ్యాంలో వదిలేశారు. వర్షాకాలంలో నీటి ప్రవాహానికి మొసలి కాలువలోకి వచ్చి ఉండవచ్చని అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News