: `పైసా` చిత్ర నిర్మాత ఆఫీసులో అగ్నిప్రమాదం
రవితేజ హీరోగా వచ్చిన `మిరపకాయ్` సినిమాతో టాలీవుడ్ నిర్మాతగా అవతరించిన రమేష్ పుప్పాల ఆఫీసులో ఇవాళ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఫిల్మ్ నగర్ లో ఉన్న పుప్పాల ఆఫీస్ లో సుమారు రూ.5 లక్షల మేర ఆస్తినష్టం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పుప్పాల ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో నాని హీరోగా `పైసా` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఈ సినిమాకి సంబంధించిన బ్యానర్లు, దుస్తులు అగ్నికి ఆహుతైనట్టు సమాచారం.
- Loading...
More Telugu News
- Loading...