: వరంగల్ అండర్ బ్రిడ్జిపై మరమ్మత్తులు... రైళ్ల రాకపోకలకు అంతరాయం
వరంగల్ అండర్ బ్రిడ్జిపై మరమ్మత్తుల కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎలుగూరు రైల్వే స్టేషన్లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ గంటసేపటికి పైగా నిలిచిపోయింది. గోల్కొండ ఎక్స్ ప్రెస్ కాజీపేటలో అరగంట క్రితం ఆగిపోయింది. వరంగల్, కాజీపేట, ఎలుగూరు, చింతలపల్లి స్టేషన్లలో గూడ్సు రైళ్లు నిలిచి ఉన్నాయి. ఈ మరమ్మత్తు పనులు మరో రెండు గంటలు పట్టవచ్చని అధికారులు చెప్పారు.